జనం న్యూస్ డిసెంబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం పేదోడి కల సహకరమే చేసే రీతిలో ఇండ్లు మంజూరు చేసి, ఇవ్వడమే ధ్యేయంగా పనిచేసే నాయకుడు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు పరకాల మున్సిపాలిటీ రెండో వార్డులో ఒంటేరు సంతోషమ్మ వరుణ్ ఇటీవల మంజూరైన సందర్భంగా ఇల్లు నిర్మాణం కోసం విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ ముగ్గు పోసి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు దుబాసి వెంకటస్వామి, పరకాల ఎస్సీ విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,పట్టణ ఉపాధ్యక్షులు ఒంటేరు శ్రవణ్ కుమార్ పరకాల పట్టణ కాంగ్రెస్ నాయకులు యాకూబ్ పాష, స్థానికులు డి.రమేష్, పాస్టర్ మంద ఏరియా, ఒంటేరు రాము,భారతి, లక్ష్మి పరకాల మున్సిపాలిటీ రెండో వార్డు వార్డ్ ఆఫీసర్, కృష్ణంరాజు, తదితరులు పాల్గొన్నారు…..


