Listen to this article

నల్గొండ జిల్లా పీ.ఏ.పల్లి మండలం జనం న్యూస్ రిపోర్టర్ శ్రీరమణ

గుడిపల్లి మండలం లోని కోదండపురం గ్రామంలో పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ పూజలు ఘనంగా జరిగావి. ఏడాదిలో 24 ఏకాదశులు ఉన్నాయి అందులో ముక్కోటి ఏకాదశి విశిష్టమైనది ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటవి, ముక్కోటి దేవతలు విష్ణుమూర్తి దర్శనం కోసం వైకుంఠం చేరుకుంటారు అందుకే ఈ రోజు నే వైకుంఠ ఏకాదశి అంటారు అని ఆలయ పూజారి శ్రీనివాస్ చార్యులు చెప్పారు. గ్రామము లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి దర్శనం చేసుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, పాలక సభ్యులు, గ్రామ ప్రజలు చుట్టూ పక్కన గ్రామ ప్రజలు దర్శనం చేసుకున్నారు.