జనం న్యూస్ డిసెంబర్ 31 ముమ్మిడివరం ప్రతినిధి
కొత్త సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందే పంపిణీ చేయాలని ఆదేశాలు మేరక ఆయా బ్యాంకులు నుండి నగదును తీసుకువచ్చి పంపిణీకి సిద్ధం చేశారు,2026 జనవరి 1 నూతన సంవత్సర సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డిసెంబర్ 31వ తేదీన అందజేయడం జరుగుతుందని కాట్రేనికోన ఎంపీడీవో ఎస్ వెంకటాచలం తెలిపారు,మండల పరిధిలో 10,150 పింఛను దారులకు 4 కోట్ల 44 లక్షల రూపాయలను ఇంటింటికి వెళ్లి నగదును పంపిణీ చేస్తామన్నారు,డిసెంబర్ 31వ తేదీన పంపిణీ కాకపోతే జనవరి 2 వ తేదీన లబ్ధిదారులకు సచివాలయం సిబ్బంది నగదు అందజేస్తామని ఎంపిడిఓ వెంకట చలం పేర్కొన్నారు,ఆయా పంచాయతీ కార్యదర్శిల నుండి సచివాలయం ఉద్యోగులకు నగదును అందజేశామని ఎంపీడీవో ఎస్ వెంకటచలం తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపిడిఓ నున్న శంకర్ నారాయణ,మండల పరిషత్
పరిపాలన అధికారి కె సంఘమిత్ర,కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు


