జనం న్యూస్, డిసెంబర్ 31, 2025: ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతాపార్టీ
పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావును బివిసి విద్యాసంస్థల చైర్మన్ బోనం కనకయ్య మంగళవారం ఆయన కార్యలయంలో సుబ్బారావు చేస్తున్న సేవలకు గాను సన్మానించారు. బి.వి.సి విద్యాసంస్థల చైర్మన్ బోనం కనకయ్య చేతుల మీదుగా సన్మానం అందుకోవడం చాలా గర్వంగా, సంతోషంగా ఉందని. నాపై నమ్మకం ఉంచి నన్ను ప్రోత్సహించిన కనకయ్య గారికి మరియు బి.వి.సి యాజమాన్యానికి మోకా సుబ్బారావు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మండేల నాగ వెంకటప్రసాద్ పాల్గొన్నారు.


