Listen to this article

✍️జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 5 రిపోర్టర్ సలికినిడి నాగరాజు✍️ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, రాష్ట్రంలో విరివిగా సాగయ్యే ప్రధాన వాణిజ్యపంటను, సాగుదారుల్ని రక్షించాల్సిన బాధ్యత కేంద్రానిదే పుల్లారావు.అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా నూతన సాగు విధానాలపై దేశంలోని మిర్చి రైతులకు అవగాహన కల్పించాలి : పుల్లారావువ్యాపారుల మాయాజాలం.. మార్కెట్ హెచ్చుతగ్గుల కట్టడికి ప్రత్యేక చట్టాలతో చెక్ పెట్టి రైతుల కష్టానికి తగిని ఫలితం దక్కేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి : పుల్లారావు.పెరిగిన సాగువ్యయం.. ధరల పతనంతో మిర్చి రైతులు నష్టాలబారిన పడి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గతం కంటే ఈ ఏడాది మిరప సాగు విస్తీర్ణం లక్ష ఎకరాలు తగ్గినప్పటికీ, ఉన్న పంటకు కూడా సరైన గిట్టుబాటు ధర లేనందున నష్టాలు చవిచూస్తున్నారు అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత సీజన్లో దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ, పెట్టుబడి వ్యయం రెట్టింపై ఎకరాకు లక్షన్నర వరకు నష్టపోతున్నారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, ఏపీలో ప్రధాన వాణిజ్య పంట సాగుచేసే రైతుల్ని కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పొగాకు, స్పైసెస్ బోర్డు మాదిరే ప్రత్యేక మిర్చి బోర్డు ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా ఉన్న మిరప రైతుల్ని ఆదుకునేదిశగా కేంద్రం అడుగులేయాలి. భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే మిర్చి, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా సాగయ్యేలా కేంద్రం వెంటనే తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. అలానే మిర్చిరైతులకు నూతన సాగు విధానాలపై అవగాహన కల్పించి, తక్కువ పెట్టుబడితో, నాణ్యతతో కూడిన ఎక్కువ దిగుబడి సాధించేలా నూతన సాగు విధానాల వైపు మళ్లించాలి. దానివల్ల ఎగుమతులు పెరిగి, రైతులకు మంచి ధర లభించడమేగాక, అంతర్జాతీయ విపణిలో భారత మిర్చి విక్రయాలు ఊపందుకుంటాయి. పంట సాగు చేసేటప్పుడు ధర బాగానే ఉంటున్నా, చేతికొచ్చే సమయానికి తగ్గిపోవడం రైతుల్ని కలవరపరుస్తోంది. మార్కెట్ హెచ్చుతగ్గులు.. వ్యాపారుల మాయాజాలంపై కూడా కేంద్రప్రభుత్వం దృష్టి పెట్టాలి. అవసరమైతే ప్రత్యేక చట్టాలతో రైతుల కష్టానికి తగిన ఫలితం దక్కేలా చూడాలి.గతంలో చంద్రబాబు క్వింటాకు రూ.1500లు అందించి మిర్చి రైతుల్ని ఆదుకున్నారుగతంలో మిర్చిధరలు తగ్గినప్పుడు రైతుల్ని ఆదుకోవడానికి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు క్వింటాల్ కు రూ.1500వరకు ప్రోత్సాహకం ప్రకటించారు. అదే విధంగా వ్యాపారులు కొనుగోళ్లలో స్వలాభానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరిపించారు. తూకాలు, కమీషన్ల పేరుతో రైతుల్ని దోచుకునే దళారులు ఎత్తుగడ లకు చెక్ పెట్టారు. మిర్చి యార్డ్ కు వచ్చే రైతులకు ఇబ్బంది లేకుండా భోజనం, విశ్రాంతి సదుపాయాలు కల్పించారు. గుంటూరు మిర్చియార్డ్ లో జరిగే క్రయవిక్రయాలపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమించి, రైతులకు ఇబ్బందులు లేకుండా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మిర్చిరైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూటమిప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. మిర్చిధరల తగ్గుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో చర్చించి, రైతుల్ని వెంటనే ఆదుకోవాలని ఆదేశించడం జరిగింది.మిర్చి రైతుల సమస్యలను కేంద్రానికి తెలియచేసిన ఎంపీమనరాష్ట్రంలో మిర్చి సాగు తగ్గినా, తెలంగాణ.. మధ్యప్రదేశ్.. కర్ణాటక రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరగడం.. అక్కడ దిగుబడి అధికంగా ఉండటంతో ఆంధ్రా మిర్చిపై ఆ ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో మిర్చి ధరల తగ్గుదల, రైతుల సమస్యలను నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో మిర్చిరైతుల కష్టాలు, ధరల క్షీణత, పంటలబీమా సమస్యను ఆయన కేంద్ర వ్యవసాయమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు తెలియచేశారు. మిర్చి ధరల పతనంపై కేంద్రం వెంటనే స్పందించి సంబంధిత విభాగాలతో సమీక్ష నిర్వహించి తగు చర్యలు తీసుకొని, మిర్చి రైతుల్ని అన్ని విధాలా ఆదుకోవాలి.” అని మాజీమంత్రి పుల్లారావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు.