

జనం న్యూస్ ఫిబ్రవరి 5 నడిగూడెంవేసవికాలంలో గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఇర్ఫాన్ తెలిపారు. బుధవారం మండలంలోని తెల్లబల్లి, యక్లాస్ ఖాన్ పేట గ్రామాలలో మిషన్ భగీరథ ట్యాంక్,పైపులైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా సమస్యలను గుర్తించి పరిష్కారం చేపట్టి వేసవిలో నీటి సమస్యలు లేకుండా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సయ్యద్ ఇమామ్,ఎంపీఓ విజయలక్ష్మి,గ్రామ స్పెషల్ ఆఫీసర్లు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శిలు లక్ష్మీ ప్రవళిక,శోభన్ బాబు మిషన్ భగీరథ సిబ్బంది వెంకన్న, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.