Listen to this article

జనం న్యూస్: డిసెంబర్ 31 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా.)


యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆదేశాల మేరకు పట్టణంలో క్లస్టర్ ఇంచార్జి -2 షేక్ మస్తాన్ వలి (మ్యాక్స్) పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న NTR భరోసా పింఛన్ పంపిణి కార్యక్రమంలో అధికారులతో కలిసి పింఛన్ దారులకు పింఛన్ లను పంపిణి చేశారు. ఈ సందర్బంగా నూతన సంవత్సర కానుకగా ఒక రోజు ముందే పింఛన్ లను కూటమి ప్రభుత్వం అందజేసిందని, ఉదయం 7 గంటల నుండే సచివాలయ సిబ్బందితో కలిసి టీడీపీ శ్రేణులు పింఛన్ లను పంపిణి చేశారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది సోమ్లా నాయక్, యూనిట్ కో ఇంచార్జ్ గోళ్ళ సుబ్బారావు బూత్ ఇంచార్జ్ లు బొందిలి కిషోర్ సింగ్ షేక్ యూసుఫ్ నూరి తదితరులు పాల్గొన్నారు.