బీ వీరేశం సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ జనం న్యూస్ 31 డిసెంబర్
జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ సజ్జాపూర్ గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రసాద్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థులు తొలి అడుగులోనే ఘన విజయం సాధించారు. నాలుగు గ్రామాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని చూరగొని ప్రత్యర్థులను ఓడించి స్పష్టమైన మెజారిటీతో గెలుపొందడం విశేషం. గ్రామ అభివృద్ధి, మౌలిక వసతులు, రైతుల సమస్యల పరిష్కారం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా తమ పాలన సాగిస్తామని విజేతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాద్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థులను ఘనంగా అభినందించారు. ఈ విజయం సజ్జాపూర్ గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.


