బి వీరేశం సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ జనం న్యూస్ 31 డిసెంబర్
ఈ సందర్భంగా వ్యవసాయ కమిటీ శ్రేణి కార్యదర్శి, ప్రత్యేక శ్రేణి రైతులు, వ్యాపారులు, పాలకవర్గ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరం రైతులకు, వ్యాపారులకు మంచి పంటలు, లాభదాయకమైన వ్యాపారాలు, సుఖసంతోషాలతో కూడిన జీవితం తీసుకురావాలని ఆకాంక్షించారు. జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు పాలకవర్గం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. రైతుల సంక్షేమం, మార్కెట్ అభివృద్ధి, పారదర్శక పాలన లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, రైతులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన సంవత్సరాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.



