Listen to this article

జనం న్యూస్ :31డిసెంబర్ బుధవారం సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;

శ్రీవాణీ స్కూల్‌లో నూతన సంవత్సరం కార్యక్రమం ఉత్సాహంగా బుధవారం రోజున ఘనంగా నిర్వహించబడింది. పాత సంవత్సరాన్ని వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరాన్ని విజయాలతో స్వాగతించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టారని స్కూల్ డైరెక్టర్ సత్యం సార్ తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ,“విద్యార్థులు కొత్త సంవత్సరంలో క్రమశిక్షణ, లక్ష్యం, కష్టపడి చదివే అలవాటు పెంచుకొని, ప్రతి రోజు ఒక చిన్న విజయాన్ని నమోదు చేసుకుంటూ ముందుకు సాగాలి. ఇలాంటి చిన్న ప్రయత్నాలే పెద్ద విజయాలకు పునాది అవుతాయి” అని అన్నారు.స్కూల్ టీచర్స్ అందరూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.“ఎడ్యుకేషన్‌తో పాటు మంచి విలువలను అలవర్చుకొని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలి. రాబోయే సంవత్సరంలో మరింత ర్యాంకులు, ప్రతిభావంతులైన విద్యార్థులు మా స్కూల్ నుండి రావాలని ఆశిస్తున్నాం” అని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
విద్యార్థులు కూడా స్పీచ్‌ల ద్వారా తమ సంకల్పాలను వెల్లడించారు.విద్యార్థులు చివరగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.