

జనం న్యూస్; 5 ఫిబ్రవరి బుధవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:పూర్వ విద్యార్థుల ఆత్మీక సమ్మేళనాని సంబంధించిన అవగాహన సదస్సు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కౌన్సిలర్ సమక్షంలో సిద్దిపేట గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నందు నిర్వహించారు. రెగ్యులర్ కాలేజీలకు సమానంగా ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థి, విద్యార్థులకు కూడా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించడం జరగాలని ఒక కొత్త ఒరవడికి నాంది పలికి పుర విద్యార్థులు అందరిని ఒక చోటికి చేర్చే మహత్తరం కార్యక్రమానికి అందరూ భాగస్వాములు కావాలని ఈ సమ్మేళనానికి సంబంధించిన వివరాలను కింది ఇవ్వబడిన వాట్సాప్ నంబర్లకు 97044 25028 మరియు 9581072143 కి కాల్ చేసి నివృత్తి చేసుకోగలరని ఆత్మీయ సమ్మేలాన్ని విజయవంతం చేయాలని సిద్దిపేట స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్. శ్రద్ధానందం అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిబ్బంది పూర్వ విద్యార్థులు కౌన్సిలర్లు పాల్గొన్నారు.