Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 2

మండలంలోని గ్రామంలో ఉన్న ప్రభుత్వ హై స్కూల్‌లో ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాల సమయం ముగిసిన అనంతరం ఇష్టానుసారంగా అవాంఛనీయ చర్యలకు పాల్పడుతున్నారు. స్కూల్ బోర్డులపై అనుచిత రాతలు రాయడం, బాత్రూంలలోని వాటర్ పైపులను పగలగొట్టడం, గేట్‌పై నుంచి దూకి లోపలికి ప్రవేశించడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అంతేకాకుండా స్కూల్ ప్రాంగణంలో మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న గ్రామపంచాయతీ గ్రామ సర్పంచ్ మిలటరీ రాజు స్పందిస్తూ పాఠశాల ఆస్తి ధ్వంసం చేయడం, విద్యార్థుల భద్రతకు ముప్పుగా మారే ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ఇకపై ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు లేదా ఇతరులు స్కూల్ ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి ఇలాంటి పనులు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులు, తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండి ఇలాంటి ఘటనలు గమనించిన వెంటనే గ్రామపంచాయతీకి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.