Listen to this article

జనం న్యూస్ 02 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

బళ్లారి (కర్ణాటక):కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటు అంశంపై చెలరేగిన వివాదం హింసాత్మకంగా మారి కాల్పులకు దారితీసింది.బళ్లారిలో ఎమ్మెల్యే భరత్‌రెడ్డి సన్నిహితుడు సతీష్‌రెడ్డి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సమయంలో గాలి జనార్దన్‌రెడ్డి గన్‌మన్ అప్రమత్తమై సతీష్‌రెడ్డి చేతిలోని తుపాకీని లాక్కుని రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో గాలి జనార్దన్‌రెడ్డి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.ఇరువర్గాల మధ్య పరస్పర కాల్పులు జరగడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, సతీష్‌రెడ్డికి గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి భారీగా పోలీసు బలగాలు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం బళ్లారి నగరంలో భద్రత కట్టుదిట్టం చేశారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వాల్మీకి విగ్రహ ఏర్పాటు విషయంలో రాజకీయ, వ్యక్తిగత విభేదాలే ఈ హింసకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు….