Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 02 జనవరి

జాతర సందర్భంగా శుక్రవారం శనివారం ఆదివారం రోజులలో లక్షలాది మంది భక్తులు తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ జాతరకు ప్రత్యేకతగా బంజారా సంప్రదాయాలు ఆచారాలు ఉత్సవ వాతావరణంలో నిర్వహించబడతాయని పేర్కొన్నారు అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు వైద్య శిబిరాలు పారిశుధ్య ఏర్పాట్లు భద్రత చర్యలు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ జాతరలో రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అన్ని వర్గాల ప్రజలు కులమత బేధాలు లేకుండా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని చెప్పారు మూడు రోజుల పాటు జరిగే ఈ మహా జాతర సందర్భంగా పరిసర గ్రామాలు జనసంద్రంగా మారనున్నాయని భక్తులు అమ్మవారి కృపతో తమ కోరికలు నెరవేరాలని మొక్కులు చెల్లించుకుంటారని స్థానికులు తెలిపారు.