తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 02 జనవరి
. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని మిలిటరీ రాజు సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మోహన్ రెడ్డి పటేల్ సర్పంచ్ మిలిటరీ రాజుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు తినిపించి శుభాభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని, ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండటం గర్వకారణమని మోహన్ రెడ్డి పటేల్ పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమం గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగగా, గ్రామస్తులు సర్పంచ్ మిలిటరీ రాజుకు మరింత సేవాభావంతో పని చేయాలని ఆకాంక్షించారు.


