జనం న్యూస్ జనవరి(2) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గంలోని ప్రధాన రహదారి మరమత్తులను తక్షణమే చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య శుక్రవారం నాడు డిమాండ్ చేశారు. గాంధీ విగ్రహం నుంచి కోర్టు వరకు ఉన్న ప్రధాన రహదారి పూర్తిగా గుంతల మయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు సుమారు మూడు నెలల క్రితం రోడ్డును సన్న కంకర పోసి వదిలేయడంతో ప్రస్తుత వాహనాల రాకపోకల వల్ల తీవ్రంగా దుమ్ము లేచి ఇరుపక్కల ఇళ్లలో, దుకాణాలలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాదచారులపై దుమ్ము పడటంతో పాటు కళ్ళలోకి వెళ్లి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రజాప్రతినిధులు నిరసనలు తెలిపిన అధికారులు స్పందన లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.ప్రధాన రహదారి మరమ్మత్తు పనులు వెంటనే పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్,కేతిరెడ్డి గోపాల్ రెడ్డి,సర్పంచ్ చింతకుంట్ల మనోజ్, నాయకులు చింతకుంట,నాగేష్, గోపగాని రమేష్,గోపగాని వెంకన్న, రాజేష్,విజయ్ తదితరులు పాల్గొన్నారు.


