Listen to this article

పాపన్నపేట,జనవరి01 ( జనంన్యూస్)

: నూతన సంవత్సరం సందర్భంగా ఏడుపాయల వన దుర్గామాత ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.భక్తులు ఈ సందర్భంగా పలు ప్రాంతాలనుండి ఏడు పాయలకు చేరుకున్న భక్తులు నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని అమ్మవారిని కోరుకుంటూ మొక్కుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితులు అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంకరించారు.ఈ సందర్భంగా ఏడుపాయల రాజగోపురం ప్రాంతం నుండి అమ్మవారి ఆలయం వరకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో చిన్నపాటి జాతరను తలపించింది. ఏడుపాయల ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు రాకుండా ఆలయ ఈఓచంద్రశేఖర్ తో పాటు ఆలయ సిబ్బంది భక్తులకు పూర్తి స్థాయిలో ఏర్పాటు కల్పించారు.