Listen to this article

[ జనం న్యూస్ జనవరి 2 2026 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ

ముమ్మిడివరం పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు సమావేశం స్థానిక డాక్టర్ జంధ్యాల చంద్ర శేఖర్ రావు & జంధ్యాల సాంబశివ కుమార్ కళ్యాణ మండపము – రోటరీ క్లబ్ నందు నూతన కమిటీ సమావేశం జరిగింది. సదరు సమావేశమునకు జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ , ముమ్మిడివరం నగర పంచాయతీ ఇంచార్జి ఇళ్ల సత్యనారాయణ హాజరై బీజేపీ సిద్దాంతాలు, నియమాలు, బీజేపీ ని సైద్దాంతికంగా ప్రజలు లోకి తీసుకొని వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. రాబోయే స్థానిక సంస్థలు, పట్టణ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండేలా కార్యకర్తలు ఉండాలని సూచించారు. ఎన్నికల అధికారిగా ఇళ్ల సత్యనారాయణ వ్యవహారించారు. కార్యకర్తలు, నాయకులు అందరూ ఏకగ్రీవంగా సన్నిధిరాజు వీరభద్ర శర్మ ను అధ్యక్షులు గాను,ప్రధాన కార్యదర్శిగా దంగుడుబియ్యం శ్రీనివాసరావు ను ఎన్నుకొన్నారు. మరియు ఉపాధ్యక్షులుగా ఆకుల శ్రీ మాచరావు, జనిపెల్ల శ్రీనివాసరావు, చొల్లంగి శంకర్, దొమ్మేటి బాలరాజు, దంతులూరి సాయి రాజు , శ్రీమతి నిట్టల వెంకటలక్ష్మి, కార్యదర్శలుగా శ్రీమతి పెనుమాల శాంతి శ్రీ , గుమ్మలూరి లక్ష్మణరావు , రాయుడు గంగా శివకుమార్, వాడ్రేవు అజయ్ కుమార్ వర్మ , ఎల్లమిల్లి శ్రీనివాస రావు, కోశాధికారి గపుల్లెల వెంకట నరసింహ శాస్త్రి, కార్యవర్గ సభ్యులుగా బసవాహరిబాబు, తటవర్తి నాగరాజు, గుడిమెళ్లంక వెంకటలక్ష్మి, సానబోయినలక్ష్మి ఎన్నికయ్యారు. ప్రమాణస్వీకారనంతరం అధ్యక్ష, కార్యదర్శలు, అందరూ బీజేపీ పార్టీని ముమ్మిడివరం పట్టణం లో బలోపేతం చేస్తామని, కూటమి నాయకులతో కలిసి పనిచేస్తామని తెలియ జేశారు.