Listen to this article

జనం న్యూస్ జనవరి 2 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం రాష్ట్ర సచి వాలయంలో మేడికొండ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మేడికొండ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏలాంటి పరిస్థితుల్లో ఉన్న పార్టీని విడలేదని, పార్టీ ఎదుగుదలకు అహర్నిశలు కృషి చేస్తూ, కార్యకర్తలు అందరిని ఏకతాటిపై తీసుకోని వచ్చి పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో గల ఏ ఒక్క డివిజన్ కైనా సరే కార్పొరేటర్ గా రానున్న ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించుకున్నారు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.