Listen to this article

జనం న్యూస్ జనవరి 02: నిజామాబాద్ జిల్లా

ఏర్గట్లమండలకేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజునా 2026 సంవత్సర క్యాలెండర్ మండల విద్యాధికారి ఆనంద్ రావు , కాంప్లెక్స్ పి జి ప్రధానోపాధ్యాయులు కృష్ణ చారి చేతుల మీదుగా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సంఘం మరింత బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని పి ఆర్ టి యు మండల అధ్యక్షులు కృష్ణప్రసాద్ మాట్లాడారు.ఆవిష్కరణ అనంతరం తహసీల్దారు, ఎంపిడిఓ, ఎం పి ఓ, ఎస్సై గార్లకు 2026 సంవత్సర క్యాలెండర్లను మర్యాదపూర్వకంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, మండల అసోసియేట్ అధ్యక్షులు మైసల సుధాకర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గటాడి భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపల్లి రాజేందర్, జిల్లా కార్యదర్శి సాదుల గంగాధర్, పీజీ ప్రధానోపాధ్యాయులుజావిధ్, ఉపాధ్యాయులు రామిండ్ల రవి, మునీరుద్ధిన్, గైని గంగాధర్, ప్రవీణ్ శర్మ, సబ్బాని శ్రీనివాస్, గంగ మోహన్, ఏం కె ప్రసాద్, నరేష్, ట్వింకిల్ తదితరులు పాల్గొన్నారు.