Listen to this article

డోంగ్లి జనవరి 2 :-జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలంలోని సొసైటీ మరియు ప్రైవేట్ ఎరువుల దుకాణాలను స్థానిక మండల వ్యవసాయ అధికారి రాజు మరియు మండల స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్ సర్ తనిఖీ చేయడం జరిగింది.రైతులకు అందుబాటులో యూరియా ఉంచాలని, స్టాక్ బోర్డు, ధరల పట్టిక పెట్టాలని సూచించడం జరిగింది.అలాగే సొసైటీ యందు రెండు రోజులో యూరియా వస్తుంది.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు, సొసైటీ సీఈఓ గంగాధర్, రైతులు పాల్గొన్నారు.