Listen to this article

జనం న్యూస్ జనవరి 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

నూతన సంవత్సరం వేళ విద్యుత్ వినియోగదారులకు సంక్రాంతి కానుకగా రూ “4,497 కోట్లు ట్రూ ఆఫ్ చార్జీలు నుంచి ఊరట కలిగిస్తూ, ఆ భారాన్ని మొత్తం ప్రభుత్వం చెల్లించే విధంగా నిర్ణయం తీసుకోవడం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన దక్షతకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. విద్యుత్ వినియోగదారులకు యూనిట్ కు 13 పైసలు చొప్పున రాయితీ కల్పిస్తూ, నిర్ణయం తీసుకోవడం, ఎన్నికల సమయంలో కరెంటు చార్జీలు పెంచబోమని హామీని నిలబెట్టుకున్నారని నాగ జగదీష్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 923 కోట్లు ట్రూ డౌన్ చేసి రికార్డు సృష్టించిన ప్రభుత్వం తాజాగా మరోసారి 4497 కోట్లు వినియోగదారులకు కలిగించడానికి ముఖ్యమంత్రి నిర్ణయం హర్షణీయమని, ప్రజలకి ఇచ్చిన హామీ ప్రకారం 2025 సెప్టెంబర్ నుండి యూనిట్కు 13 పైసలు చొప్పున తగ్గిస్తూ వస్తున్నారని, మరలా ఇప్పుడు కొత్త సంవత్సరంలో 4,497 కోట్ల భారాన్ని వారిపై మోపకుండా ప్రభుత్వం భరిస్తూ వినియోగదారులకు ఉపశమనం కలిగించిందని నాగ జగదీష్ అన్నారు. అలాగే మరో రెండు ప్రకటనలు వెలువడిందని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకునే వారికి వడ్డీ రాయితీ కల్పించి రాష్ట్రవ్యాప్తంగా 11 వేల మందికి ప్రయోజనం కలిగే విధంగా చర్యలు తీసుకోవడం ఎస్సీ సామాజిక వర్గంలో హర్షం వ్యక్తం అవుతుందని, అలాగే భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో ఈ నెల 4 తేదీన అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉత్తరాంధ్రలో భారీ స్థాయిలో నిర్మాణం చేపట్టిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పం నెరవేరిందని, ఉత్తరాంధ్రకు చెందిన పార్లమెంట్ సభ్యులు కేంద్ర విమానయాన శాఖ మాత్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు కృషి ఫలితంగా జనవరి 4వ తేదీన ఢిల్లీ నుండి భోగాపురం ఎయిర్పోర్ట్ కు విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తో పాటు అధికారులు ప్రయాణం చేస్తూ ట్రయల్ రన్ చేయడం శుభపరిణాముని, ఈ సంవత్సరం జూన్ నాటికి పూర్తి చేసి ఆగస్టు నుండి ప్రయాణికులు దేశ విదేశాల ప్రయాణం చేసే విధంగా చర్యలు తీసుకోవడం కూటమి ప్రభుత్వం సాధించిన విజయమని, నాగ జగదీష్ అన్నారు.//