Listen to this article

జనం న్యూస్ జనవరి 2 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం లో శుక్రవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగాక్యాలెండర్ ని మండల విద్యాధికారి విట్టల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రమేష్ ధన మూర్తి నేడు మధ్యాహ్న భోజన సమయంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిలిప్చేడ్ నందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ విట్టల్ మాట్లాడుతూ పెద్ద అక్షరాలతో క్యాలెండర్ చక్కగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోహన్, సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షురాలు కవిత, జిల్లా కోశాధికారి అజయ్ కుమార్, ఉపాధ్యక్షులు ఆదినారాయణ, కోశాధికారి నాగమణి , రాష్ట్ర సోషల్ మీడియా సభ్యులు యాదయ్య, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోబ్బి ఉపాధ్యాయులు శ్రీనివాస రావు, రంజిత్, శంకర్ సింగ్, మల్లేశం, రాజ మల్లేశం,ఉపాధ్యాయులు పాల్గొన్నారు