Listen to this article

జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 02 పెబ్బేరు శుక్రవారం

పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని సమస్యల పరిష్కారం కోసం సుభాష్ చౌరస్తా వనపర్తి రోడ్డులో బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వి దిలీప్ కుమార్ రెడ్డి బి ఆర్ ఎస్ పెబ్బేరు మండల అధ్యక్షులు వనం రాములు యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది పెబ్బేరు పట్టణంలో నిధులు ఉన్న ఆగిపోయిన పనులను వెంటనే చేపట్టాలని పెబ్బేరు నుండి వనపర్తి పోవు బీటీ రోడ్డు డ్రైనేజీ సెంటర్ లైటింగ్ కరెంటు స్తంభాల సెట్టింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి వనపర్తి రోడ్డు విస్తరణలో కోల్పోయిన లబ్ధిదారులకు వెంటనే ఇండ్ల పట్టాలు ఇవ్వాలి లేదా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి విలేకరుల కాలనీ నుండి వనపర్తి రోడ్డు వరకు గల 6 ఎకరాల 30 గుంటలలో లేఔట్ డెవలప్ మెంట్ చేసి రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన బాధితులకు ప్లాట్ల పట్టాలు పంపిణీ చేయాలి పాత ఎన్ హెచ్ 7 సుంకులమ్మ గుడి దగ్గర కల్వర్టు మరియు బిటి రోడ్డు పనులు చేపట్టాలి కొల్లాపూర్ కమాన్ అంబేద్కర్ చౌరస్తా నుండి వేణుగోపాల స్వామి దేవాలయం వరకు సెంట్రల్ లైటింగ్ మరియు రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు అగ్రిమెంట్ అయిన పనులను వెంటనే చేపట్టాలి అమృత్2 లో ఆగిపోయిన పనులను వెంటనే ప్రారంభించాలి మున్సిపల్ క్రీడా మైదానాన్ని వాడుకలోకి తేవాలి ఆగిపోయిన మున్సిపల్ వాహనాలను వెంటనే వాడుకలోకి తేవాలి ఆగిపోయిన మున్సిపల్ ఫిల్టర్ వాటర్ ప్లాంట్లను రిపేర్ చేసి వెంటనే వాడుకులోకి తేవాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు