జుక్కల్ జనవరి 2 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో కీలక రాజకీయ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆదివారం 04-01-2026 రోజున ఉదయం 11 గంటలకు, జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద బండయప్ప ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ స్థాయి సమావేశం జరగనుంది.ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారు, ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచులు మరియు ముఖ్య కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రజల సమస్యల పరిష్కారంలో సమన్వయంతో పనిచేయాల్సిన విధానాలపై స్పష్టమైన మార్గదర్శకత్వం అందించనున్నారు.ఈ ముఖ్య సమావేశానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ గారు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. జిల్లా స్థాయిలో పార్టీ కార్యాచరణ, భవిష్యత్ రాజకీయ ప్రణాళికలు, గ్రామపంచాయతీల పాత్రపై ఆయన కీలక సందేశం ఇవ్వనున్నారు.ఈ సమావేశం జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నూతన సర్పంచులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపే కార్యక్రమంగా ఇది నిలవనుందని అంచనా.


