యువతకు క్రికెట్ కిట్ అందజేత
జనం న్యూస్,జనవరి 03,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని పిఎం దామరగిద్ద గ్రామ సచివాలయం ముందు శనివారం సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూల మాలలు టెంకాయలు కొట్టి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే జయంతి ప్రతి సంవత్సరం జనవరి 3న జరుపుకుంటారు,పూలే 1831 జనవరి 3న జన్మించారు.పూలే భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త, జ్యోతీరావ్ ఫూలే భార్య, కుల,లింగ వివక్షలకు వ్యతిరేకంగా పోరాడి, మహిళా విద్య, సామాజిక న్యాయం కోసం కృషి చేశారని అన్నారు.జననం: 1831 జనవరి 3, మహారాష్ట్రలోని నయాగావ్.మరణం: 1897 మార్చి 10.భారతదేశంలో మహిళల విద్యకు పునాది వేసి,తొలి బాలికల పాఠశాలను స్థాపించారు.సామాజిక సంస్కరణ,విద్య, మహిళా సాధికారతలో పూలే పోషించిన పాత్రకు గుర్తుగా ఈ జయంతిని జరుపుకుంటామని అన్నారు.జయంతి సందర్భంగా యువతకు క్రికెట్ కిట్ అందించారు. నేటి సమాజంలో గ్రామ అభివృద్ధిలో యువకుల ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు. యువకులు ఆదర్శప్రాయులై గ్రామానికి మంచి పేరు ప్రతిష్టను తీసుకురావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుభాష్,మాజీ ఎంపీటీసీ సాయిలు, వార్డ్ మెంబర్లు పండరి, విట్టల్,జ్ఞానేశ్వర్ పాటిల్, వి జ్ఞానేశ్వర్,ఎస్ జ్ఞానేశ్వర్,కృష్ణ, నాందేవ్,ప్రశాంత్, శంకర్,తదితరులు పాల్గొన్నారు.


