Listen to this article

జనం న్యూస్ 3 జనవరి 2026,

సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వానికై పోరాడుదాం అని,
మహిళలు, దళితులు, శూద్రులు చదువు పొందకూడదనే కఠినమైన కాంక్షలు ఉన్న కాలంలో
వాటన్నింటినీ చేదించి విద్య మాత్రమే విముక్తి మార్గమని రూపించిన ధైర్య శీలి సావిత్రిబాయి పూలే
అణచివేత, అవమానం, అపహాస్యం వంటి ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ.సమానత్వం, మానవత్వం, న్యాయం అనే విలువల కోసం ఆమె అరుపెరుగని పోరాటం చేశారు.కుల, లింగ, సామాజిక వివక్ష నుండి విముక్తి పొందాలంటే చదువే ఆయుధం గా పోరాడారు.బాలికల విద్య, దళితుల చదువు, వితంతువుల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప సంఘసంస్కర్త.ఆధునిక విద్యా భారతి వైతాళికురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా విప్లవ నివాళ్లు అర్పిద్దాం.. ఆమె ఆశయ స్ఫూర్తి కై పోరాడుదాం.ప్రగతిశీల మహిళా సంఘం (POW) రాష్ట్ర కార్యదర్శి వై గీత మహేందర్ అన్నారు.