Listen to this article

బిచ్కుంద జనవరి 03 :-జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం నాడు బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీమ గంగారం మాట్లాడుతూ ఆధునిక చదువు కోసం నిరంతరం పోరాడిన మహిళా చైతన్య మూర్తి, సమాజంలో దుర్గతులను రూపుమాపడానికి విశేషంగా కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి అని కొనియాడారు. ప్రతి ఒక్కరు ఆమె ఆదర్శాలను అనుసరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అధ్యక్షునితో పాటు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్, సీనియర్ నాయకులు అసద్ అలీ, సురేష్ గొండ బొగ్గు మీది సాయిలు, సాయిని బసవరాజ్, బాలకృష్ణ, షకీల్, జలీల్ ఉత్తం నాయక్ చింతల్ హనుమాన్లు దౌతాపూర్ మారుతి , కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.