Listen to this article

మహానీయురాలికి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు

జనం న్యూస్ 3డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.

సిర్పూర్ (యు ): సావిత్ర బాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం అని కుడ్మెత యశ్వంత్ రావు ఉప సర్పంచ్ పేందూరు రామారావు అన్నారు. శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సావిత్రి బాయి పూలే జయంతిని నిర్వహించారు.కాంగ్రెస్ నాయకులు మహానీయురాలికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యా రంగంలో సావిత్రిబాయి పూలే మహిళల విద్య కోసం, సమాన హక్కుల కోసం చేసిన పోరాటం నేటి తరాలకు ఆదర్శం.ఆమె చూపిన మార్గంలోనే సమాజంలో విద్య, సామాజిక సమానత్వం, అవకాశాల కల్పనకు రాష్ట్ర ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దేవి దాస్, మైనార్టీ నాయకులు షేక్ ఆరిఫ్, మన్సూర్ ఖాన్,కృష్ణ , ఆత్మ డైరెక్టర్ మోతిరామ్, సోషల్ మీడియా విఠల్ పవర్, సర్పంచ్ టెక్మం అంబరావు, తదితరులు పాల్గొనారు.