జనం న్యూస్ జనవరి 3, వికారాబాద్ జిల్లా
పరిగి మండలంలోని MPPS సుల్తాన్పూర్ తండా ప్రాథమిక పాఠశాలలో సావిత్రిబాయ్ పూలే జయంతి సందర్భంగా విద్యార్థులకు బుక్స్ ను అదివ్వడం జరిగింది.ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల మహమ్మద్ యూసుఫ్,శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్యాహిచడం జరిగింది.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మంచనపల్లి శ్రీనివాస్ PRTU రాష్ట్ర ఉపాధ్యక్షులు,అంబేడ్కర్ జాతీయ అవార్డ్ గ్రహీత మాట్లాడుతూ,జననం 1831 జనవరి 3,నా మహారాష్ట్రలోని సతరా జిల్లా పరిధిలోని నాయగావ్ లో నిమన్నా కులంలో మాలి కులస్తులైన లక్మిబాయి ఖండోజి నెవ్ దంపతులకు జన్మించారు.ఆ కాలంలో కేవలం అగ్రకుల బాలూరులకు మాత్రమే ఆశ్రమ పాఠశాలలో చదువుకునే అవకాశం ఉండేది.ఏ సామాజిక వర్గంలోని మహిళలకు చదువుకునే అవకాశం లేదు.తనకి పెళ్లి అయ్యాక మహాత్మా జ్యోతిరావు పూలే చదువు నేర్పి తన భార్య ని,సావిత్రి బాయిపూలేను సంఘ సంస్కర్తగా,మొట్టమొదతి భారతదేశంలో మహిళ ఉపాధ్యాయినిగా, రచయిత్రిగా, ఆమె నిమ్న వర్గాల అభ్యున్నటికి కృషి చేసి కుల మత బేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలిసి 1848 జనవరి 1 నా పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. సతీసహగమనానికి వ్యతిరేకంగా, వితంతువు పునర్వీవాహలకొరకు అసమాన బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపారు.బాల్యంలోనే వైదవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రమం కల్పించింది.గర్భవంతులైన వారికి పురుళ్ళు పోసి వారి కళ్ళలో వెలుగు చూసారు. అలా పురుడు పోసుకొని తన వద్దే వదిలేసి పోయిన ఓ బిడ్డను హక్కున చేర్చుకున్నారు యశ్వంత్ గా నామకరణం చేసి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు పెంచి పెద్ద చేసారు. వితంతువుకు శిరోమండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి క్షురకులను చైతన్య పరిచి, వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షరకుల చేత 1860లో సమ్మె చేయించారు సావిత్రిబాయి.తర్వాత 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజ్ అనే సామాజిక ఆధ్యాత్మిక సంస్థను స్థాపించి ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచింది,తను ప్లేగు వ్యాధి గ్రస్తులకు సేవ చేస్తూ ప్లేగు వ్యాధితో 1897 మార్చి 10 చనిపోవడం జరిగింది.కావున విద్యార్థులు సావిత్రి బాయి పూలెను ఆదర్శంగా తీసుకొని అప్పటి కాలంలో అవకాశాలు లేకున్నా చదువుకోవడం జరిగింది నేడు ప్రభుత్వలు అన్ని వసతులు కలిపిచడం జరిగింది.కావున విద్యార్థులు అవకాశాలను అంది పుచ్చుకొని మంచిగా చదువుకోవలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది.


