జనం న్యూస్ : 3 డిసెంబర్ శనివారం;సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి వై.రమేష్;
ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి సునీత అధ్యక్షతన జరిగింది జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా డాక్టర్ కే. రంజిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కె రంజిత గారు భారత దేశంలో విద్య సావిత్రిబాయి పూలే పాత్ర అనే అంశంపై ప్రసంగించారు. వారు మాట్లాడుతూ భారత దేశంలో మొట్ట మొదటిసారిగా అతి చిన్న వయసులోనే వివాహం చేసుకొని ఉపాధ్యాయురాలిగా మారిన ఘనత కేవలం సావిత్రిబాయి పూలేకే దక్కుతుందని , ఈమె భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు కావడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.ఆనాడు ఉన్న అంద విశ్వాసాల వల్ల , మూడ విశ్వాసాల వల్ల స్త్రీలు, దళితులు చదువుకు దూరంగా ఉన్నారని అసలు చదువుకోలేని పరిస్థితి అని అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో స్త్రీలకు పాఠశాలలు ఏర్పాటు చేసి వారి ఉచిత విద్యను అందజేసింది .అదే విధంగా అనాధ పిల్లలను చేరదీసి వారికి చదువుతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించేది . ఆ రోజుల్లో తన భర్త అయినా మహాత్మ జ్యోతిబాపూలే సహకారంతో పాఠశాలను నడిపి సంఘసంస్కర్తగా మంచి పేరు సంపాదించారని ఈ సందర్భంగా డాక్టర్ కే రంజిత పేర్కొన్నారు అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కి సునీత గారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జీవితం ఈనాడు ఉన్న యువతీ యువకులు ఆమెను ఆదర్శంగా తీసుకోవలసిన బాధ్యత మనందరి పైన ఉందని ఈ సందర్భంగా తెలిపారు. తాను చదువుకొని ఇతరులు చదువుకునేటట్లు చేయడం అనేది అత్యంత బాధ్యతమైన వృత్తి అయినటువంటి ఉపాధ్యాయ వృత్తిని ఆమె నేటి సమాజానికి ఆదర్శ ఉపాధ్యాయురాలుగా ఉండడం గర్వించదగ్గ విషయమని తెలిపారు..
ఈ సందర్భంగా కార్యక్రమం సమన్వయకర్త చరిత్ర విభాగం అధిపతి డాక్టర్ శ్రద్ధానందం మాట్లాడుతూ చారిత్రక విషయాలను ఉన్నది ఉన్నట్లుగా విద్యార్థులకు చెప్పాల్సిన బాధ్యత చరిత్ర విభాగం పై ఉన్నదని అందులో భాగంగానే 150 సంవత్సరాల క్రితం ఈ భారత దేశంలో సమాజానికి సేవలందించిన సావిత్రిబాయి పూలే –మహాత్మ జ్యోతిబాపూలే చేసిన సామాజిక కార్యక్రమాలను తెలియజెప్పేటువంటి విషయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.ఆ రోజుల్లో భర్త చనిపోతే విధవ రాండ్రు అయిన స్త్రీలకు మరియు వారికి జన్మించిన పిల్లలకు అండగా నిలిచి మాతృ హృదయాన్ని సావిత్రిబాయి పూలే చాటుకుందని కార్యక్రమం సమన్వయకర్త డాక్టర్ శ్రద్ధానందం పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బి అయోధ్య రెడ్డి పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ గోపాల సుదర్శనం, డాక్టర్ ఉమామహేశ్వరి, రోహిణి, డాక్టర్ కె రాణి, చరిత్ర అధ్యాపకులు డాక్టర్ ఎం కొండల్ రెడ్డి, ఆర్ నాగేశ్వరరావు, మీ బిక్షపతి జే సంఘవి పాల్గొన్నారు.


