Listen to this article

జనం న్యూస్ : 3 డిసెంబర్ : సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్దిపేట జిల్లా

ఈ నెల 2 నుంచి 10వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్‌లో జరుగుతున్న అండర్–15 ఉమెన్స్ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌కు సిద్దిపేటకు చెందిన క్రీడాకారిణి పోతుల హాసిని రాష్ట్రస్థాయి క్రికెట్ జట్టుకు ఎంపికైంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బి టీం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హాసిని, సిద్దిపేట జిల్లా లింగరెడ్డిపల్లికి చెందిన పోతుల మహేష్ కూతురు. చిన్న వయసు నుంచే క్రికెట్‌పై ఉన్న మక్కువతో, తండ్రి ప్రోత్సాహంతో నిరంతర సాధన చేస్తూ క్రికెట్‌లో రాణిస్తోంది. రాష్ట్రస్థాయిలో ఎంపికై సిద్దిపేట జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చిన హాసినిని శ్రీ వాణీ స్కూల్ డైరెక్టర్ సి.హెచ్.సత్యం హృదయపూర్వకంగా అభినందించారు. భవిష్యత్తులో జాతీయ స్థాయి