Listen to this article

వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 03 పెబ్బేరు శనివారం

పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో జెడ్ పి హెచ్ ఎస్ గర్ల్స్ హై స్కూల్ లో భారతదేశంలోమొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి ఫులె జయంతిని పెబ్బేరు జెడ్పిహెచ్ఎస్ టీచర్లు విద్యార్థులు ఘనంగా జరుపుకొన్నారు ఈ సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేశారు స్కూలులో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉపన్యాస పోటీల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొని సావిత్రిబాయిని స్మరించుకున్నారు ప్రతి ఒక్క మహిళకు ఆమె స్ఫూర్తిగా నిలవాలని టీచర్లు చెప్పారు కార్యక్రమంలో స్కూలు హెచ్ఎం వి సుమిత్రమ్మ భారతమ్మ కమలమ్మ రాధా రాణి శాంతాబాయి భాగ్య చంద్రిక రాధ తదితరులు పాల్గొన్నారు