తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 03 జనవరి
దేవరంపల్లి పల్లి గ్రామానికి చెందిన చాకలి శేఖర్ అదే పాఠశాలలో చిన్న తనం లో చదువు కొని తాను చదువుకున్న పాఠశాలో విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ లను పంపిణీ చేసి సేవ దృక్పధాన్ని చాటుకున్నారు. ఈ చిన్న పాటి సేవ చెయ్యడం చాలా సంతోషం అని తెలియజేసారు.సమాజంలో అందరు కూడా తాను చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల కు ఎదో ఒక సేవ చెయ్యాలని సూచించారు.చిన్న చిన్న సామాజిక సేవలు కూడా సంతృప్తి ఇస్తాయని ఝారసంఘం మండల విద్యాధి కారి శ్రీనివాస్ లు అన్నారు. సామాజిక సేవ చెయ్యడం లో అందరూ పోటీ పడాలి అని గ్రామ సర్పంచ్ రవి పాటిల్ అన్నారు. అదే పాఠశాల లో చదువు నేర్పిస్తున్న భవాని ప్రధానోపాధ్యాయురాలు కూడా విద్యార్థులకు షూ లను, మరియు ఐడెంటి కార్డ్ లను అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిధుల కు సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ,వారి తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భవాని, సర్పంచ్ రవి పాటిల్, శేఖర్ రాజు ,మోహిన్ తదితరులు పాల్గొన్నారు.


