జనం న్యూస్ 04 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
చికెన్ ధరలకు రెక్కలు రావడంతో కొనుగోలుదారులు లేక షాపులు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి.
విజయనగరం జిల్లాలో 2 నెలల క్రితం వైరస్ సోకి చాలా కోళ్లు చనిపోయాయి. కోళ్ల కొరత అధికంగా ఉండడంతో ఇతర జిల్లాల నుంచి కోళ్లను తెచ్చి అమ్మకాలు చేయడంతో లైవ్ కోడి కిలో రూ.170, చికెన్ రూ.280 నుంచి రూ.300 వరకు పలుకుతోంది.ధరలు పెరగడంతో సామాన్యులు కొనుగోలు చేయడం లేదని కోళ్ల షాపు యజమానులు, ఫారం యజమానులు వాపోయారు.


