జనం న్యూస్ 04 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
రాజాం-పాలకొండ రోడ్డులో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో చోదకుడు గాయాలపాలయ్యాడు. స్థానికులు క్షతగాత్రుడుని 108లో రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడు రేగిడి మండలం ఉణుకూరు గ్రామానికి చెందిన గణేష్ గా సమాచారం.


