Listen to this article

జనం న్యూస్ 04 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా జోగులాంబ గద్వాల జిల్లా స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ 2026 సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించినారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ..మొట్టమొదటి ఉపాధ్యాయ సంఘం అయిన ఎస్టీయూటీఎస్ సంఘ క్యాలెండర్ను తన చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషాన్నిస్తుందని చెప్పారు.ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయ సంఘాలు చొరవ చూపాలని చెప్పారుభవిష్యత్తు తరాన్ని నిర్మించే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నదని, ఉపాధ్యాయులు నైతిక విలువలతో కూడిన విద్యను, క్రమశిక్షణను విద్యార్థులకు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు యం.డి. యూనుస్ పాషా, జిల్లా ప్రధానకార్యదర్శి పులిపాటి లక్ష్మణ్, జిల్లా మండలాల బాధ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.