Listen to this article

జనం న్యూస్, జనవరి 04,అచ్యుతాపురం:

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ రాంబిల్లి మండలం పరిధిలో ఉన్న ఎస్విఎస్ కెమికల్ ఇండస్ట్రీస్ లో అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని హోం మంత్రి అనిత, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్ పరిశీలించారు.ప్రమాదం ఎలా జరిగిందో కంపెనీ ప్రతినిధులను, అధికారులను మంత్రి అనిత. ఎమ్మెల్యే విజయ్ కుమార్ అడిగి తెలుసుకున్నారు.కంపెనీ ప్రతినిధులపై మంత్రి,ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.కంపెనీలో ఇన్ని ట్యాంకులు ఎందుకు ఉన్నాయి అని హోమంత్రి ప్రశ్నించారు.
ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ అచ్యుతాపురం,రాంబిల్లి మండలాల పరిధిలో గల అన్ని కంపెనీలు కలుపుకొని కోఆర్డినేషన్ కమిటీ వేస్తున్నామని అన్నారు.కంపెనీల సహకారంతో ప్రమాదాన్ని అరిగేట్టగలిగామని,కూటమి ప్రభుత్వం ఎన్ని భద్రత చర్యలు చేపట్టిన కంపెనీ యాజమాన్యం స్పందించట్లేదని తెలిపారు.ఎస్విఎస్ ఫార్మా కంపెనీపై క్రిమినల్ చర్యలు తీసుకున్నామని అన్నారు.
నిన్న దురదృష్టకరమైన సంఘటన జరిగిందని, ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు తక్షణమే స్పందించారని,ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రమాద ఘటన స్థలానికి వెంటనే చేరుకొని మంటలు అదుపు చేశారని,రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు.ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని,కంపెనీ ప్రతినిధులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎవరిని ఉపేక్షించేది లేదు. ఆయన అన్నారు.