జనంన్యూస్. 04.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాద్ లో జనవరి 05నాడు జరిగే జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంను జయప్రదం చేయండి.
2026 జనవరి 5న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో జనవరి 05 నాడు జరిగే రౌండ్ టేబుల్ సమావేశం జయప్రదం చేయాలి అని అఖిల భారత ఐక్య రైతు సంఘం ( ఏఐయుకేఎస్ ), జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, ప్రధాన కార్యదర్శి బి బాబన్న, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం( ఏఐపీకేఎంఎస్) జిల్లా అధ్యక్షులు జి కిషన్, ప్రధాన కార్యదర్శి ఇ రమేష్ లు సంయుక్త ప్రకటనలో విజ్ఞప్తి చేసారు. ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.చట్టాన్ని కొనసాగించాలనీ, వీబీ జి రాంజీ మిషన్ ను రద్దు చేయాలనీ వారు ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకం గానే
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ (MGNREGS )చట్టాన్నిపేరుమార్చిచట్టంఉద్దేశాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు పునుకున్నది అని అందుకే “వీబి జి రాం జీ ”మిషన్ అని పేరు పెట్టి ప్రభుత్వం కార్మికులకు ఉపాధి కల్పించే బాధ్యత నుండి వై దొలిగే కుట్ర పునుకుంటున్నదన్నారు .బీవీ జి రాంజీ పేరా సవరణ తో వ్యవసాయ రైతు, కూలీల జీవితాలు మరింత ప్రశ్నర్తకంగా మారే ప్రమాదం ఉంది అన్నారు.
ఈ అంశాలు రైతు కూలీలకు వివరించి కార్మిక,కర్షక ఉద్యమం తో పాత చట్టాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు.;MGNREGS . మారిన తర్వాత వీబీజీ రాంజీ మిషన్లో అమలు జరిగితే ఫీల్డ్ అసిస్టెంట్ ల కూడా ఉద్యోగ భద్రత ఉండదని గుర్తించాలన్నారు. మనమంతా ఐక్యంగా పోరాడి పాత, చట్టాన్నికాపాడుకుందాం. వారు పిలుపును ఇచ్చారు.05 జనవరి 20 26 నాడు నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఉదయం 11:00లకు నిర్వహించడం జరుగుతుంది అని ఏఐయుకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్, ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ లు హాజరు కానున్నట్టు వారు తెలియజేశారు.
ఈ రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్


