Listen to this article

జనం న్యూస్:జనవరి 4 (రిపోర్టర్:కొత్తమసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా.)

మర్కాపురం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు.

మార్కాపురం జిల్లా కేంద్రంలోని తర్లుపాడు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇంచార్జి జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం నియోజక వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లాకు సంబంధించిన అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు.జిల్లాలో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాల్లో రెవెన్యూ సిబ్బంది హాజరగుచున్నందున ఈ నెల 5వ తేదీన జరగవలసిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం వాయిదా వేయడం జరిగిందని, పిజిఆర్ఎస్ కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.