[ జనం న్యూస్ జనవరి 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండల
కేంద్రంలో నూతనంగా నిర్మితమవుతున్న అన్న క్యాంటీన్ పరిశీలించిన గౌరవ ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి త్వరలోనే ఈ అన్న క్యాంటీన్ అందుబాటులోకి తెచ్చి పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో లక్షల మందికి అన్న క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని ఇది కూటమి ప్రభుత్వం యొక్క చారిత్రాత్మక విజయం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి నాగిని నాగేశ్వరరావు విత్తనాల వెంకటరమణ కముజు వెంకటరమణ వెంట్రు సుధీర్ వత్సవాయి రవి మండల సీనియర్ నేతలు కార్యకర్తలు అభిమానులు అధికారులు ప్రజలు పాల్గొన్నారు



