జనం న్యూస్ 05 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా బొండపల్లికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డా. చలుమూరి రవిశేఖర్ అరుదైన గౌరవం పొందారు. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక సీఎస్ఐఆర్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సి.ఆర్.ఆర్.ఐ.) డైరెక్టర్గా జనవరి 2న బాధ్యతలు స్వీకరించారు. సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించి, అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తగా ఎదిగిన ఆయన ప్రస్థానం జిల్లా వాసులకు ప్రేరణగా నిలిచింది. రవాణా రంగం, రోడ్డు భద్రతపై ఆయన పరిశోధనలు చేశారు.


