Listen to this article

జనం న్యూస్ 6 ఆలేరు యాదాద్రి జిల్లా ( మండల్ రిపోర్టర్ ఎండి జహంగీర్ ) ఆలేరు పట్టణంలోని కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లు గా ముందుకు తెచ్చి కార్మిక వర్గానికి ద్రోహం చేసే లేబర్ కోడ్ లను వెనక్కి తీసుకోవాలని, దేశ రైతాంగానికి నష్టకరమైన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.జనార్ధన్,రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొల్లూరి రాజయ్య లు కేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
రైతులకు కనీస మద్దతు ధర చట్టాన్ని గ్యారెంటీ చేయాలని,కార్మికులకు 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.మోడీ ప్రభుత్వం గడిచిన పది సంవత్సరాల కాలంతో పాటు,మూడవసారి అధికారంలోకి వచ్చిన ఈ కాలంలో కూడా పూర్తిగా ప్రజా,రైతు,కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని,మొత్తానికి మాత్రం సంపన్న వర్గాలకు ఈ దేశ సంపదను,సహజ వనరులను,ఉత్పత్తులను, అటవీ సందపను దోచిపెడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మంగ నర్సింహులు, కేమిడి ఉప్పలయ్య,ఏ ఐ కే ఎం ఎస్ ,జిల్లా అధ్యక్షులు మామిడాల సోమయ్య, కల్లెపు అడవయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ సిపిఎం నాయకులు ఎండి ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు