

జనం న్యూస్ 5 ఫిబ్రవరి కోటబొమ్మాళి మండలం : చలికాలం పూర్తి అయి పిభ్రవరి మొదటి వారం అవుతున్నా….. ఉదయం వేళలో బారెడు పొద్దెక్కినా మంచు తెరలు తొలగక సూర్యకిరణాల కోసం నిరీక్షణ తప్పడం లేదు. బుధవారం జాతీయ రహదారి పై పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉంది. నిండా పొగ మంచు కురుస్తండటంతో వాహనదారులు లైట్లు వేసుకుని నిదానంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఏ మాత్రం అశ్రద్ద వహించినా ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. ఉదయం 10 గంటలైనా జాతీయ రహదారులు, గ్రామ రహదారుల్లో మంచుకురుస్తుండడంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క రబీలో వేసుకున్న అపరాలకు, మామిడి, జీడి పువ్వుదశలో ఉన్నందున మంచు ప్రభావంతో తీవ్రంగా దెబ్బతీస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.