Listen to this article

ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే కేవలం భవనాలు, రోడ్లు ఉంటే సరిపోదు ఆ గ్రామం పచ్చదనంతో, పరిశుభ్రంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఈ విషయాన్ని గుర్తించిన మా గ్రామ సర్పంచ్ గారు, ఇరోజు ఘనపురం గ్రామంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న చెట్లను మరియు రోడ్లను పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు.ఇది గ్రామస్తులందరి ప్రశంసలు అందుకుంటోంది సర్పంచ్ గారు తీసుకున్న ఈ చొరవ గ్రామంపై ఆయనకున్న బాధ్యతను తెలియజేస్తోంది. “మన గ్రామం – మన పరిశుభ్రత” అనే నినాదంతో సాగుతున్న ఈ పనిలో గ్రామస్తులు కూడా భాగస్వాములై, రోడ్లపై చెత్త వేయకుండా ఉండటం మన అందరి బాధ్యత. పచ్చని చెట్లు, శుభ్రమైన రోడ్లే గ్రామ ప్రగతికి అసలైన చిరునామా ఆయన తెలియజేశారు .ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తోటకూరీ వెంకయ్య గారు, గ్రామ పంచాయతీ సెక్రటరీ మరియు వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.