Listen to this article

జనం న్యూస్ జనవరి 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

శాయంపేట మండల కేంద్రంలో బహుజన సంక్షేమ సంఘం(బీఎస్ఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మారపెల్లి క్రాంతికుమార్ మాట్లాడుతూ మండలంలోని పెద్దకోడెపాక శివారులోని 633 సర్వే నెంబలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలకు గుడిసెలు వేసి రెండు సంవత్సరాలు గడిచిపోయింది,ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆనాడు గుడిసేవాసుల దగ్గరకి వచ్చి నన్ను గెలిపిస్తే ఈ ప్రాంతంలో ఉన్న ప్రకృతిని నాశనం చేస్తున్న విద్యార్థులకు నష్టం కలిగించే విధంగా ఉన్న క్వారీలను తక్షణమే మూసివేస్తానని, అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలకు సర్వేనెంబర్ 633 పెద్దకోడపాక గ్రామ శివారులో వేసుకున్నటువంటి గుడిసెలకు శాశ్వత పట్టాలు కల్పించి, పక్కా గృహాలు నిర్మించి ఇస్తానని చెప్పి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గుడిసె వాసులకు ఇప్పటివరకు ఎటువంటి న్యాయం జరగకపోవడం వారికి కనీస వసతులు కల్పించకుండా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఎంపికలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదల్ని గుర్తించి ఈ సర్వే నెంబర్ ని గుర్తించి శాశ్వత పట్టాలు కల్పించి అందరికీ ఇక్కడ గృహాలు నిర్మించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గత రెండు సంవత్సరాలుగా ఇల్లు లేని నిరుపేదలు ఇక్కడే జీవనం కొనసాగిస్తూ కనీస వసతులు లేకుండా బిక్కుబిక్కుమంటు నివాసం ఉంటున్నారు, కాబట్టి తక్షణమే ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం మాట నిలుపుకోవాలి తెలియజేశారు
ఈ కార్యక్రమంలో బహుజన సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మోగ్గం సుమన్
హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు మారపల్లి విజయ్ కుమార్ మండల అధ్యక్షులు మారపెల్లి సుధాకర్. అల్లే కుమార్ తదితరులు పాల్గొన్నారు…..