టీజీ ఎస్ డబ్ల్యూ ఆర్ఎస్ ఎల్కతుర్తి ప్రిన్సిపల్ ఏ .హేమలత
జనం న్యూస్ జనావరి 5 2025,(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )
ఎల్కతుర్తి :- మండల పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను , 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల/కళాశాల ప్రిన్సిపల్ ఏ. హేమలత ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు 2025 డిసెంబర్ 21 నుండి 2026 జనవరి 21 వరకు పూర్తిగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు సంబంధించిన ఈ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 22న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు విద్యార్థి సంతకం చేసి వివరాలు సమర్పించాల్సిందిగా పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తుల కోసం సమీపంలోని మీసేవ కేంద్రాలను సంప్రదించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హత గల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.


