జనం న్యూస్ జనవరి 05: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం తొలి సమావేశం సోమవారం సర్పంచ్ ప్రవీణ్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచ్ మూడ్ దయానంద్‌తో పాటు వార్డు సభ్యులు తమ తమ వార్డుల పరిధిలో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారానికి అవసరమైన నిధులపై చర్చించారు. అలాగే గత రెండు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిగిన ఆదాయ–వ్యయాల వివరాలను పంచాయతీ కార్యదర్శి ఆకుల రవి సమావేశంలో చదివి వినిపించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచ్ మూడ్ దయానంద్‌తో పాటు వార్డు సభ్యులు పోకల్కర్ గణేష్, సారంగి ముత్తేమ్మ, మౌనిక, కొత్తపల్లి నీలిమ, మాలవత్ భీమానాయక్, తాళ్ళ అరవింద్, బి. గంగాధర్, కారోబార్ కొండ శంకర్ తదితరులు పాల్గొన్నారు.


