జనం న్యూస్ జనవరి 05: నిజామాబాద్
ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది సోమవారం స్థానిక సర్పంచ్ భూషణవేణి ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచ్ మూడ్ దయానంద్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సారంగి ముత్తేమ్మలను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేందర్ మాట్లాడుతూ పాఠశాలలో నెలకొన్న మౌలిక వసతులసమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు మౌనిక,ప్రియదర్శిని, వివి శ్రీలేఖ, అంగన్వాడీ టీచర్ ఇర్గేలా పద్మతో పాటు ఇతర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.


