

జనం న్యూస్ 06 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.సురేష్ డిమాండ్ చేశారు. సీఐటీయు ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బ్రిటీష్ కాలం నాడు కార్మికుల పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేసి యజమానులకు అనుకూలంగా 4లేబర్ కోడ్లు తీసుకురావటానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నమన్నారు.